అసెంబ్లీ వెళ్లే ధైర్యం లేకపోతే పదవుల్లో ఉండటం ఎందుకు?

2024-11-08 16:45:41.0

అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని జగన్‌ ప్రకటించడంపై షర్మిల ఫైర్‌

https://www.teluguglobal.com/h-upload/2024/11/08/1376152-ys-sharmila.webp

అసెంబ్లీకి హాజరుకాని వారు ఎవరైనా రాజీనామా చేయాల్సిందేనని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. జగన్‌ అయినా, వైసీపీ ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభకానున్నాయి. ఈ సమావేశాలకు హాజరుకావడం లేదని జగన్‌ ప్రకటించడంపై షర్మిల స్పందించారు. మచిలీపట్నంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీ వెళ్లే ధైర్యం లేకపోతే పదవుల్లో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ వెళ్లి ఏం మాట్లాడగలమని జగన్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ వెళ్లకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా సమావేశాల ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఈ విషయంలో జగన్‌ తీరును తప్పుపడుతూ విమర్శించారు.