2025-02-22 13:32:15.0
సోమవారం గవర్నర్ ప్రసంగానికి హాజరుకానున్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
https://www.teluguglobal.com/h-upload/2025/02/22/1405929-jagan.webp
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం గవర్నర్ ప్రసంగానికి హాజరుకానున్నారు. మంగళవారం నుంచి శాసనసభకు హాజరుపై జగన్ ఇంకా నిర్ణయానికి రాలేదని సమాచారం. శాసనసభకు, బడ్జెట్ సమావేశాలకు రావడంపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 24న ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నది. మొదటిరోజు బీఏసీ తర్వాత ఎన్నిరోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.