https://www.teluguglobal.com/h-upload/2024/11/02/1374315-accident.webp
2024-11-02 05:06:02.0
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఘటన
సూర్యాపేట జిల్లా 65వ నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కోదాడ సమీపంలోని కట్టకొమ్ముగూడెం వద్ద ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో 30 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సును డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపాడు. ఇదే క్రమంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీ కొట్టడంతో 28 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ట్రావెల్స్ వెనుక సీట్లలో కూర్చుకున్న వాళ్లు, ఆర్టీసీ బస్సులో ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ప్రమాదానికి గురయ్యారు.
Road accident,on National Highway 65,Suryapet district,28 passengers minor injuries,2 serious injuries