ఆత్మ విశ్వాసపు దుప్పటితో (కవిత)

2023-10-08 09:11:26.0

https://www.teluguglobal.com/h-upload/2023/10/08/837284-mohammed.webp

కునుకులమ్మను ఒడిసి పట్టి

కలల లోగిలిలో బంధించి

కనబడని తీరాలకు చేర్చి

కాసింత సాంత్వన పొందాలని ఉంది.

గాయపడి రక్తమోడుతూ

గాఢంగా అలుముకుని

గది గది నింపుతున్న

జ్ఞాపకాల తెరలను

గట్టిగా విదిలించుకుని

గెలుపు తీరాలకు చేరాలని ఉంది…

మనసు పలికే మూగ భావాల

మంచు తెరలు దింపుతూ

మస్తిష్కంలో ముసురుకుని

మిన్నంటిన

ఆలోచనా దారాల పోగులను

మౌనంగా చుట్ట బెడుతూ

ఆత్మ విశ్వాసపు దుప్పటితో

నిశీధి పరదాలను

తొలగించాలని ఉంది…. ! ! 

-మొహమ్మద్. అఫ్సర వలీషా

(ద్వారపూడి (కోనసీమ. జిల్లా)

Mohammed Afsar Walisha,Telugu Kavithalu