ఆప్‌ నాలుగో జాబితా విడుదల.. కేజ్రీవాల్ ఎక్కడ అంటే..?

2024-12-15 11:20:50.0

దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం నాలుగో జాబితా విడుదల చేసింది.

https://www.teluguglobal.com/h-upload/2024/12/15/1386098-kejarval.webp

ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ 38 మందితో కూడిన అభ్యర్ధుల నాలుగో జాబితా ఇవాళ ప్రకటించింది. ఆప్‌ చీఫ్‌, మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ సీటు నుంచి అలాగే కల్కాజీ నుంచి ముఖ్యమంత్రి అతిషి పోటీ చేయనున్నారు. గ్రేటర్ కైలాష్ నుంచి మంత్రి సౌరభ్ భరద్వాజ్, బాబర్‌పూర్ నుంచి గోపాల్ రాయ్ బరిలోకి దిగుతున్నారు. శకుర్ బస్తీ నుంచి సత్యేంద్ర కుమార్ జైన్, రాజిందర్ నగర్ నుంచి దుర్గేష్ పాఠక్ పోటీ చేయనున్నారు. మొత్తం 70 మంది అభ్యర్థుల్లో 20 మంది సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరించారు. మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌‌పై షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ పోటీ చేయనున్నారు. 2025 ఫిబ్రవరిలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ప్రజాకోర్టు’ తీర్పు తర్వాత మాత్రమే తిరిగి ఆ పదవి చేపడతానని అన్నారు. అలాగే కాంగ్రెస్‌తో ముందస్తు ఎన్నికల పొత్తుకు అవకాశం లేదని తేల్చిచెప్పారు. సొంత బలంతోనే తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

Aam Aadmi Party,Arvind Kejriwal,New Delhi,Atishi,Sheila Dixit,Minister Saurabh Bhardwaj