2016-06-28 02:47:30.0
ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్లకు సంపాదన పెరిగినట్టుగానే అనారోగ్యాలు కూడా పెరుగుతున్నట్టుగా ఒక సర్వేలో తేలింది. ఇంటా బయట పెరుగుతున్న పనిఒత్తిడి వారికి లేనిపోని అనారోగ్యాలను తెచ్చిపెడుతున్నది. అసోచామ్ (అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా) నిర్వహించిన ఒక సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 32 నుండి 58 సంవత్సరాల లోపు వయసున్న మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో ఉద్యోగినులు నాలుగింట మూడువంతుల మంది తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నట్టుగా తేలింది. సమయం తక్కువ, పనులు బాధ్యతలు […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/06/women-health-problems.gif
ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్లకు సంపాదన పెరిగినట్టుగానే అనారోగ్యాలు కూడా పెరుగుతున్నట్టుగా ఒక సర్వేలో తేలింది. ఇంటా బయట పెరుగుతున్న పనిఒత్తిడి వారికి లేనిపోని అనారోగ్యాలను తెచ్చిపెడుతున్నది. అసోచామ్ (అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా) నిర్వహించిన ఒక సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 32 నుండి 58 సంవత్సరాల లోపు వయసున్న మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో ఉద్యోగినులు నాలుగింట మూడువంతుల మంది తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నట్టుగా తేలింది.
సమయం తక్కువ, పనులు బాధ్యతలు ఎక్కువగా ఉండటం వలన మనసు శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురికావటం, సమయానికి భోజనం చేయకపోవటం, తగిన విశ్రాంతి, నిద్రలేకపోవటం…శరీరానికి తగిన వ్యాయామం లేకుండా ఎక్కువ సమయం కూర్చోవటం…ఇవన్నీ ఉద్యోగిసులను వేధిస్తున్న సమస్యలు. ఈ సమస్యల కారణంగా వచ్చే లైఫ్‌స్టయిల్ వ్యాధులు వారిని ఎక్కువగా వెంటాడుతున్నాయని అద్యయనం చెబుతోంది. కొలెస్ట్రాల్ పెరగడం, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ జబ్బులు, ఒబెసిటి, డిప్రెషన్, తీవ్రమైన నడుంనొప్పి, మధుమేహం, అధిక రక్తపోటు లాంటివి ఉద్యోగినుల్లో ఎక్కువగా ఉన్నట్టుగా గమనించారు.
చాలావరకు మహిళలు ప్రశాంతంగా పనిచేయడానికే ప్రయత్నిస్తారు. కానీ వారు చేస్తున్న ఉద్యోగాలు, నిర్వహిస్తున్న ఇంటి బాధ్యతల కారణంగా, ఎంతగా ఒత్తిడిని తట్టుకుంటున్నా వ్యాధుల బారిన పడుతున్నారని సర్వేలో వెల్లడైంది. 42 శాతం మంది ఉద్యోగినులు నడుంనొప్పి, ఒబెసిటి, డిప్రెషన్, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి లైఫ్‌స్టయిల్ జబ్బులతో బాధపడుతున్నట్టుగా గుర్తించారు. సర్వే నిర్వహించిన మహిళల్లో 22శాతం మంది దీర్ఘకాలిక వ్యాధులతోనూ, 14 శాతం మంది ఆ వ్యాధుల వలన హఠాత్తుగా తలెత్తే సమస్యలతోనూ బాధపడుతున్నట్టుగా తేలింది. మొత్తానికి ఇంటిని కళ్లలో పెట్టుకుని కాపాడుకునే ఆడవాళ్లు తమ ఒంటిని కూడా పట్టించుకోవాలని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.