http://www.teluguglobal.com/wp-content/uploads/2016/05/Amber-Heard-and-Tasya-Van-R.gif
2016-05-30 04:10:09.0
అమెరికా నటుడు, నిర్మాత, సంగీత కళాకారుడు జానీ డెప్ (52) భార్య, అమెరికా నటి అంబర్ హర్డ్ లారా (30), భర్తనుండి విడిపోయి తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ని చేరింది. జానీ, అంబర్‌లకు గత ఏడాదే వివాహం కాగా, జానీ డెప్ తనను హింసిస్తున్నాడంటూ అంబర్ హర్డ్ కోర్టుకెక్కింది. అయితే తాను ఆమెను కొట్టడం నిజం కాదని, ఆమె తనను డబ్బుకోసమే వివాహం చేసుకుందని, ఆమెలోని ద్విలింగ ప్రవృత్తే తననుండి ఆమె విడిపోవడానికి కారణమని జానీ చెబుతున్నాడు. అంబర్ […]
అమెరికా నటుడు, నిర్మాత, సంగీత కళాకారుడు జానీ డెప్ (52) భార్య, అమెరికా నటి అంబర్ హర్డ్ లారా (30), భర్తనుండి విడిపోయి తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ని చేరింది. జానీ, అంబర్‌లకు గత ఏడాదే వివాహం కాగా, జానీ డెప్ తనను హింసిస్తున్నాడంటూ అంబర్ హర్డ్ కోర్టుకెక్కింది. అయితే తాను ఆమెను కొట్టడం నిజం కాదని, ఆమె తనను డబ్బుకోసమే వివాహం చేసుకుందని, ఆమెలోని ద్విలింగ ప్రవృత్తే తననుండి ఆమె విడిపోవడానికి కారణమని జానీ చెబుతున్నాడు. అంబర్ హర్డ్ ఎనిమిది సంవత్సరాల క్రితమే తన గర్ల్ ప్రెండ్ తాస్యా వ్యాన్ రీ (40)ని వివాహం చేసుకుంది. తాస్యా అమెరికన్ నటి, ఫొటోగ్రాఫర్.
అంబర్, తాస్యాతో తన అనుబంధానికి డొమెస్టిక్ పాట్నర్ షిప్ (వివాహానికి సమాన గుర్తింపు) పొంది తన పేరుని సైతం అంబర్ వ్యాన్ రీగా మార్చుకుంది. అయితే అప్పట్లో గే మ్యారేజ్ చట్టబద్దం కాదు కనుక, వారు తమ వివాహాన్ని బయటకు వెల్లడించలేదు. 2011లో అమెరికాలో గే మ్యారేజేస్ని చట్టబద్ధం చేశాక, అంబర్, తాస్యా పెద్ద ఎత్తున పార్టీ చేసుకున్నారు. తరువాత వారు 2012లో విడిపోయారు. 2015లో జానీ డిప్ని అంబర్ వివాహం చేసుకుంది. అప్పటికే జానీ డిప్కి రెండు పెళ్లిళ్లయ్యాయి.
జానీ డిప్ని వివాహం చేసుకు న్నాక కూడా అంబర్, తిరిగి తాస్యాతో అనుబంధాన్ని కోరుకుంటూ అంబర్ వ్యాన్ రీ అనే పేరునే ఆర్థిక, వ్యాపార వ్యవహారాల్లో కొనసాగించిందని తెలుస్తోంది. ప్రస్తుతం జానీ డిప్తో విడిపోయి అంబర్, తిరిగి తన పాత గర్ల్ ప్రెండ్ని చేరుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కోర్టుకి మొహంమీద గాయాలతో హాజరైన అంబర్ తనను జానీ హింసించాడని చెబుతుండగా, జానీ మొదటి భార్యలు ఇద్దర్లో ఒకరు, అతను మంచివాడని కొట్టే రకం కాదని చెబుతుంటే, మరొకరు అతను భార్యను కొట్టలేడని వెల్లడించారు. జానీ డిప్ 17 ఏళ్ల కూతురు సైతం తన తండ్రి మంచివాడని తెలిపింది.
https://www.teluguglobal.com//2016/05/30/ఆమె-తన-పాత-ప్రియురాలిని/