ఆమ్‌ ఆద్మీ పార్టీకి భారీ షాక్‌

2024-11-17 08:08:36.0

పార్టీకి మంత్రి కైలాశ్‌ గహ్లోత్‌ రాజీనామా

https://www.teluguglobal.com/h-upload/2024/11/17/1378551-kailash-gehlot.webp

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్‌ ఆద్మీ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ మినిస్టర్‌ కైలాశ్‌ గహ్లోత్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ చీఫ్‌, మాజీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ కు పంపారు. రాష్ట్రంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని, వాటిని అధిగమించడానికి అసంపూర్తి వాగ్దానాలు చేస్తోందని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేయడానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ ఏర్పడిందని.. కానీ పార్టీ నేతలు ఆ ఆశయాలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో నిజమైన అభివృద్ధి జరగలేదని.. దేశ రాజధాని ప్రాంత పాలకపక్షంగా ప్రజల కోసం పనిచేయడం కన్నా కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికే ఎక్కువ సమయం కేటాయించామని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేనని.. తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

Kailash Gahlot,Delhi Minister,Aam Admi Party,Resign,Arvind Kejriwal. Up Coming Assembly Elections