ఆయ‌న‌కు ఆప్ష‌న్ క‌న్నా ఆక్ష‌న్ బెట‌ర్‌

2022-07-06 20:17:25.0

ఇటీవల చంద్రబాబు కంటే వైసీపీ నాయకులు ఎక్కువగా పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది. మంత్రులు, మాజీ మంత్రులు కూడా పవన్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి ధనవాణిగా పేర్కొంటే.. అసలు జనసేననే ధనసేనగా అభివర్ణించారు ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇప్పటి వరకూ పవన్ ని దత్తపుత్రుడు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఆయన పార్టీని కూడా ధనసేన అంటూ […]

ఇటీవల చంద్రబాబు కంటే వైసీపీ నాయకులు ఎక్కువగా పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది. మంత్రులు, మాజీ మంత్రులు కూడా పవన్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి ధనవాణిగా పేర్కొంటే.. అసలు జనసేననే ధనసేనగా అభివర్ణించారు ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇప్పటి వరకూ పవన్ ని దత్తపుత్రుడు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఆయన పార్టీని కూడా ధనసేన అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఆప్షనల్ పార్టీ, ఆప్షనల్ పొలిటీషియన్..
పవన్ కల్యాణ్ ఓ ఆప్షనల్ పొలిటీషియన్ అని, ఆయనది ఓ ఆప్షనల్ పార్టీ అని విమర్శించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అసలు ఆయన్ను నాయకుడి అని సంబోధించడమే తనకు ఇష్టం లేదని, ఆ వ్యక్తి అంటూ పవన్ ని టార్గెట్ చేశారు. ఎనిమిదేళ్లలో జనసేన పార్టీ 8 వేర్వేరు పార్టీలతో పొత్తు పెట్టుకుందని, అసలు రాజకీయాల్లో 8 ఏళ్లలో 8 పార్టీలను మార్చింది ఒక్క జనసేనేనని ఎద్దేవా చేశారు మంత్రి అమర్నాథ్. రాజకీయాల్లో ఆప్షన్లు ఉండవని, కానీ పవన్ కల్యాణ్ ఆప్షన్లు ప్రకటిస్తున్నారని, ఆప్షనల్ పాలిటిక్స్ ఆయనకే చెల్లాయని చెప్పారు. అన్ని ఆప్షన్లు ఇవ్వడం కంటే, ఎవరు ఎక్కువ రేటు ఇస్తారనే విషయంలో ఓ వేలంపాట పెట్టుకుంటే బాగుండేదని, ఆప్షన్ కంటే ఆయన ఆక్షన్లో పాల్గొంటే బెటర్ అని అన్నారు అమర్నాథ్.

చంద్రబాబుని ప్రశ్నించలేదేం..?
గత ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ ఏనాడు చంద్రబాబుని ప్రశ్నించలేదని మండిపడ్డారు మంత్రి అమర్నాథ్. చంద్రబాబు హామీలకు తనది పూచీ అంటూ ప్రచారంలో పాల్గొన్నారని, ఐదేళ్లలో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా టీడీపీ మోసం చేస్తే పవన్‌ కళ్యాణ్‌ వారికి వంతపాడారే కానీ ప్రశ్నించలేదన్నారు. అలాంటి పవన్ 95 శాతం హామీలను నెరవేర్చిన సీఎం జగన్‌ ను ప్రశ్నించడం విడ్డూరమన్నారు. రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బిజినెస్ ర్యాంకులపై టీడీపీ విమర్శలు చేస్తోందని.. మళ్లీ అధికారంలోకి రావాలన్న తాపత్రయం మినహా టీడీపీకి మరో ఆలోచన లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.

 

AP,criticized,gudivada amarnath,Minister,Pawan Kalyan