2016-07-07 01:06:25.0
ఇంట్లో తయారుచేసుకున్న ఆహారమే అన్నివిధాలా ఆరోగ్యానికి మంచిదని ఇప్పటికే చాలా అధ్యయనాలు రుజువు చేశాయి. శుచి శుభ్రతల పరంగానే కాకుండా, ఇంట్లో తినేవారు ఆరోగ్యానికి హాని చేసే జంక్ఫుడ్కి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరొక అధ్యయనంలో ఇంటి ఆహారాన్ని తీసుకునేవారిలో మధుమేహం బారిన పడే ముప్పు 15శాతం వరకు తగ్గుతుందని తేలింది. ఆమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. సంవత్సరాల తరబడి ఎంతోమంది వాలంటీర్ల ఆహారపు అలవాట్లను, జీవన విధానాన్ని […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/07/home-food.gif
ఇంట్లో తయారుచేసుకున్న ఆహారమే అన్నివిధాలా ఆరోగ్యానికి మంచిదని ఇప్పటికే చాలా అధ్యయనాలు రుజువు చేశాయి. శుచి శుభ్రతల పరంగానే కాకుండా, ఇంట్లో తినేవారు ఆరోగ్యానికి హాని చేసే జంక్ఫుడ్కి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరొక అధ్యయనంలో ఇంటి ఆహారాన్ని తీసుకునేవారిలో మధుమేహం బారిన పడే ముప్పు 15శాతం వరకు తగ్గుతుందని తేలింది. ఆమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. సంవత్సరాల తరబడి ఎంతోమంది వాలంటీర్ల ఆహారపు అలవాట్లను, జీవన విధానాన్ని పరిశీలించి, అధ్యయనం చేసి వారు ఈ ఫలితాలను కనుగొన్నారు. ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో తీసుకునే ఆహారంలో పోషక విలువలు తక్కువగా ఉండి శక్తినిచ్చే పదార్థాలే ఎక్కువగా ఉంటాయని ఇవి శరీరంలో కొవ్వుగా పేరుకుపోయి, స్థూలకాయం, మధుమేహం లాంటి సమస్యలకు దారితీస్తాయని వారు తెలిపారు.
ఇలాంటి వార్తలు విన్నపుడు మనం సాధారణంగా ఇంట్లో వండుకునేందుకు బద్దకిస్తున్నారని, బయటి ఫుడ్లకు అలవాటు పడిపోతున్నారంటూ మాట్లాడుతుంటాం, రాస్తుంటాం. కానీ దీని వెనుక మరొక కారణం కూడా ఉంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందరూ తినాలని చెబుతుంటాం…కానీ అలాంటి ఆహారాన్ని తయారుచేసుకునే బాధ్యత కూడా కుటుంబంలోని వారందరికీ ఉందని ఎప్పుడూ ప్రస్తావించము.
ఇంట్లో ఎంతమందికి ఎంత ఆరోగ్యకరమైన ఆహారం కావాలన్నా ఆ ఇంటి ఇల్లాలు మాత్రమే తంటాలు పడే పరిస్థితి ఉంటుంది. ఆమెకి పనులు పెరిగి, నిస్సహాయంగా మారుతున్న కొద్దీ బయట ఆహారపు అలవాట్లు మరింతగా పెరుగుతున్నాయి. ఆఫీస్లో అలసిపోయి, ఆపై రెండుగంటలు బస్ ప్రయాణం చేసి రాత్రి తొమ్మిదింటికి ఇంటికి చేరిన మహిళ తెప్పరిల్లి…వండే వరకు ….టివి చూస్తూ గడిపే ఆరోగ్యవంతమైన భర్త, కొడుకులు, కూతుళ్లు మనచుట్టూ ఎంతోమంది ఉన్నారు. లేకపోతే ఆమె వచ్చేవరకు ఆగలేకపోతే బయట ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో దొరికే ఫుడ్ని ఫాస్ట్గా తెచ్చుకుని తింటారు కానీ, వంటింట్లోకి వెళ్లరు. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి…అని చెప్పేటపుడు ప్రతిసారీ…ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎవరికి వారు తయారుచేసుకోవాలి…అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తుంటే ఈ పరిస్థితి మారుతుంది.
home side food