2024-10-13 02:49:35.0
99 ఏళ్లు పూర్తి చేసుకుని 100 ఏట అడుగుపెడుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
https://www.teluguglobal.com/h-upload/2024/10/13/1368506-modi.webp
99 ఏళ్లు పూర్తి చేసుకుని 100 ఏట అడుగుపెడుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కు ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవకే అంకితమైన ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్లను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తల్లి భారతి కోసం ఆర్‌ఎస్‌ఎస్ సంకల్పం, అంకితభావం ప్రతీ తరానికి స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. అభివృద్ధి చెందిన భారత్‌ను సాకారం చేయడంలో కొత్త శక్తిని నింపుతుందన్నారు. విజయదశమిని పురస్కరించుకుని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రసంగాన్ని పోస్ట్ చేసిన మోడీ అది తప్పనిసరిగా వినాల్సిన విషయమని పేర్కొన్నారు.
రాజ్యసభ మాజీ సభ్యులు విజయ్‌రాజే సింధియా పుట్టినరోజు సందర్భంగా ఆమెతో దిగిన ఫొటోను మోడీ మరో పోస్ట్ చేశారు. అందులో కాషాయ రంగు దుస్తుల్లో మోడీ కనిపించారు. 1925లో ఏర్పాటైన ఆర్‌ఎస్‌ఎస్ బీజేపీకి సైద్ధాంతిక గురువుగా పరిగణిస్తారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలే బీజేపీ రాష్ట్రీయ, జాతీయ విభాగాల్లో కీలకంగా వ్యవహరిస్తుంటారు.

PM Modi,congratulates,RSS,Its 100 year journey,Mohan Bhagwat’s Dussehra speech