2024-09-26 09:41:56.0
అర్హతలున్న వారికి ప్రమోషన్లు ఇచ్చాకే ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్
విద్యుత్ ఆర్టిజన్ల ధర్నాలతో మింట్ కాంపౌండ్ దద్దరిల్లింది. విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిజన్లకు అర్హతలను బట్టి ప్రమోషన్లు ఇచ్చిన తర్వాతే జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం), జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్స్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో రెండు వేల మందికిపైగా ఆర్టిజన్లు పాల్గొనడంతో సెక్రటేరియట్ వైపు నుంచి మింట్ కాంపౌండ్ కు వెళ్లే రోడ్డును పోలీసులు మూసేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. దశాబ్దాల తరబడి సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్లకు ప్రమోషన్లు ఇవ్వకుండా ఉద్యోగాల భర్తీకి ప్రయత్నించడం సరికాదని మండిపడ్డారు.
Electricity Artisans,Dharna,Mint Compound,Demand for promotions