ఆర్టీసీ బస్సు, ట్రాలీ ఆటో ఢీ

https://www.teluguglobal.com/h-upload/2025/01/27/1398001-accident.webp

2025-01-27 10:53:07.0

13 మంది కూలీలకు తీవ్ర గాయాలు

హన్మకొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కమలాపూర్‌ మండలంలోని అంబాల వద్ద సోమవారం కూలీలను తరలిస్తోన్న ఆటో ట్రాలీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలు కాగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే గాయపడ్డ వారిని అంబులెన్సుల్లో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Accident,RTC Bus,Trolly Auto,13 People Injured,Hanamkonda,MGM Hospital