2025-02-28 09:01:44.0
దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదేనన్న ఏపీ సీఎం
https://www.teluguglobal.com/h-upload/2025/02/28/1407438-babu.webp
ఆర్థిక ఇబ్బందుల్లోనూ మంచి బడ్జెట్‌ణు ప్రజలకు అందించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఆయన అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్‌కు రూపకల్పన చేసినట్లు చెప్పారు. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే పనితీరులో మార్పు రావాలన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం ఉండాలని, గ్రూపులు సహించబోనని చంద్రబాబు హెచ్చరించారు.