2025-01-31 05:39:23.0
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల మధ్య సూచీలు రాణిస్తున్నాయి. ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 140 పాయింట్లు లాభాంతో.. నిఫ్టీ 23,000 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టాయి. మరోవైపు రేపు (ఫిబ్రవరి1) ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం మదుపర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 86.64 వద్ద మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 77.31 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,851. 80 డాలర్ల వద్ద కదలాడుతున్నది.
ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 451.31 పాయింట్ల లాభంతో 77211.12 వద్ద.. నిఫ్టీ 164.15 పాయింట్లు పెరిగి 23413.65 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, టైటాన్, మారుతీ సుజుకీ, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఐటీసీ హోటల్స్, భారతీ ఎయిర్‌టెల్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్టీపీసీ, యాక్సిక్స్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Stock Market,Sensex climbs 480 pts,NSE Nifty50,Economic Survey release; Auto,FMCG gain,Benchmark equity indices