2024-12-13 05:56:52.0
నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి
https://www.teluguglobal.com/h-upload/2024/12/13/1385445-rbi.webp
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. బ్యాంకును పేల్చేస్తామంటూ రష్యన్ భాషలో గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని పంపించారు. దీనికి సంబంధించి ముంబయిలోని మాతా రమాబాయ్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నెల వ్యవధిలో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి .
నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారని బ్యాంకు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది నవంబర్ 16న ఆర్బీఐ కస్టమర్ కేర్ నంబర్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కాల్ చేసిన వ్యక్తి లష్కరే తోయిబా సీఈవోగా తనను తాను పేర్కొన్నాడు. బెదిరించే ముందు ఫోన్‌లో పాట పాడినట్లు తెలుస్తోంది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ 2008లో ముంబయి దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.
RBI receives,Bomb threat,In Russian email,Mumbai Police launch,Probe