https://www.teluguglobal.com/h-upload/2023/03/24/500x300_728157-allu-chips.webp
2023-03-24 11:20:48.0
ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన ఆలు చిప్స్ వెనుక ఒక చిన్న రివేంజ్ కథ ఉందని మీకు తెలుసా? అందరూ ఇష్టపడే ఆలు చిప్స్ ఆలోచించి తయారుచేసిన వంటకం కాదు.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన ఆలు చిప్స్ వెనుక ఒక చిన్న రివేంజ్ కథ ఉందని మీకు తెలుసా? అందరూ ఇష్టపడే ఆలు చిప్స్ ఆలోచించి తయారుచేసిన వంటకం కాదు. అనుకోకుండా పుట్టి పాపులర్ అయ్యాయి. వీటి వెనుక ఉన్న కథేంటంటే..
ఆలూచిప్స్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది జార్జ్ క్రమ్ అనే అమెరికన్ చెఫ్. 1853లో జార్జ్ క్రమ్.. న్యూయార్క్‌లోని ‘మూన్స్ లేక్‌హౌస్’ అనే రెస్టారెంట్‌లో చెఫ్‌గా పని చేసేవాడు. ఒకరోజు ఓ కస్టమర్ ఫ్రెంచ్ ఫ్రైస్‌ను ఆర్డర్ చేశాడు. జార్జ్ క్రమ్ తెచ్చి ఇచ్చాడు. వాటిని తిన్న కస్టమర్ చప్పగా ఉన్నాయంటూ జార్జ్ క్రమ్‌ను తిట్టి ఫ్రైస్ మళ్లీ చేయమన్నాడు.
అలా రెండు సార్లు ఫ్రెంచ్‌ఫ్రైస్‌ను వెనక్కి పంపడంతో జార్జ్ క్రమ్‌కు కోపమొచ్చింది. అప్పుడు బంగాళదుంపను నిలువుగా కాకుండా అడ్డంగా కోసి, నూనెలో వేయించాడు. వాటిపై ఉప్పు బాగా చల్లి కస్టమర్‌కు ఇచ్చాడు. వాటిని తిన్న కస్టమర్ ‘ ఆహా! ఎంత రుచిగా ఉన్నాయో’ అంటూ లొట్టలేసుకుంటూ తిన్నాడు.
ఆ తర్వాత ఆ రెస్టారెంట్ అడ్డంగా కోసిన ఆలు చిప్స్‌కు ఫేమస్ అయింది. జార్జ్ క్రమ్ వాటికి ‘సరసొటా చిప్స్’ అని పేరుపెట్టాడు. ఆ తర్వాత జార్జ్ క్రమ్ సొంతంగా రెస్టారెంట్ పెట్టి ‘పొటాటో క్రంచెస్’గా కొత్త డిష్‌ను పరిచయం చేశాడు. అలా జార్జ్ క్రమ్ కోపం నుంచి ఆలు చిప్స్ పుట్టాయి.
అయితే అప్పట్లో కేవలం రెస్టారెంట్‌లో మాత్రమే దొరికే ఈ చిప్స్‌ను తర్వాతి రోజుల్లో ఊరూరా తిరిగి అమ్మడం మొదలుపెట్టారు. అలా ప్లేట్‌లోని చిప్స్ ప్యాకెట్‌లోకి మారాయి.
Do You Know,Potato Chips,Food,Potato Chips Benefits
Do You Know, Potato Chips, how Potato Chips were born, potato chips recipe, potato chips benefits
https://www.teluguglobal.com//health-life-style/do-you-know-how-potato-chips-were-born-896146