2025-01-31 16:41:50.0
జనవరి 1న 10 గ్రాముల బంగారం ధర రూ. 79,390 ఉండగా.. నెల చివరకు రూ.5,510 మేర పెరుగుదల
బంగారం ధర పరుగులు పెడుతున్నది. 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) పసిడి ధర సరికొత్త గరిష్టాన్నినమోదు చేసింది. ఈ ఒక్కరోజులోనే రూ. 1100 పెరిగి దేశ రాజధాని ఢిల్లీలో రూ.84,900కు చేరింది. దేశీయంగా కొనుగోళ్ల మద్దతు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలు రావడానికి కారణమని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ పేర్కొన్నది. దేశీయంగా జనవరి 1న 10 గ్రాముల బంగారం ధర రూ. 79,390 ఉండగా.. నెల చివరకు రూ.5,510 మేర పెరగడం విశేషం.
అటు కిలో వెండి ధర కూడా రూ. 95 వేలు దాటింది. గురువారం వెండి కిలో రూ. 94,150గా ఉండగా.. ఒక్కరోజులో ఏకంగా రూ. 850 పెరిగింది. అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర 2800 డాలర్ల మార్కు దాటి ఇంట్రాడేలో 2859 డాలర్లకు ఎగబాకింది. అదే సమయంలో మన రూపాయి బలహీనంగా ఉండటం బంగారం ధర పెరుగుదలకు కారణమని అనలిస్టులు చెబుతున్నారు.
Gold rates,Continues,Record breaking rally,Jumps Rs 1100,All-time high Rs 84900 per 10g