2025-02-19 05:42:17.0
జనై భోస్లే తాజా మ్యూజిక్ ఆల్బమ్‌లోని ‘కెహందీ హై’ పాటను వీరిద్దరూ కలిసి పాడిన వీడియో వైరల్
భారత క్రికెటర్, హైదరాబాదీ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ ఈమధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా అతను లెజెండరీ గాయని ఆశాబోస్లే మనవరాలితో కలిసి డ్యూయెట్ సాంగ్ పాడుతున్న వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నది. ఈ వీడియోను ఇటీవల సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. అందులో జనై భోస్లేతో కలిసి ఈ క్రికెటర్ గొంతు కలిపాడు.
ఆమె తాజా మ్యూజిక్ ఆల్బమ్‌లోని ‘కెహందీ హై’ పాటను వీరిద్దరూ కలిసి పాడారు. ఈ వీడియోను సిరాజ్ పోస్ట్ చస్తూ.. ‘మనమంతా మన కలల్ని అనుసరించడానికి కారణమైన వ్యక్తి కోసం ఈ పాట. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్’ అని జనైపై ప్రశంసలు కురింపించాడు. ప్రస్తుతం వీరిద్దరి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జనై భోస్లేతో సిరాజ్ ప్రేమలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ముంబయిలోని బాంద్రాలో జరిగిన ఆమె పుట్టినరోజు వేడుకలకు సిరాజ్ హాజరయ్యాడు. దీంతో వీరిపై అనేక వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే సిరాజ్ స్పందిస్తూ ఆమె తనకు చెల్లెలు లాంటిది అని క్లారిటీ ఇచ్చాడు. ‘ఆమె లాంటి సోదరి నాకెవరూ లేరు. ఆమె లేకుండా నేను ఎక్కడా ఉండాలనుకోను. నక్షత్రాలతో చంద్రుడు ఉన్నట్లే ఆమె వెయ్యి మందిలో ఒకరు’ అనే కవిత్వాన్ని ఇన్‌స్టా స్టోరీలో పోస్టు చేశాడు. మరోవైపు జనై కూడా ఈ ఊహాగానాలకు తెరదించారు. సిరాజ్ తనకు ప్రియమైన సోదరుడు అని చెప్పడంతో ఆ వదంతలుకు చెక్ పెట్టినట్లయ్యింది. ఇదిలా ఉండగా.. నేటి నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సిరాజ్‌ను జట్టులోకి తీసుకోలేదు.నాన్ ట్రావెల్ రిజర్వ్‌గా మాత్రమే ఎంపిక చేసింది.
Mohammed Siraj,Zanai Bhosle,Siraj Viral Video,Asha Bhosle’s Granddaughter,’Kehndi Hai’ Zanai’s new music album,Champions Trophy 2025