ఆస్తి కోసం తల్లిని కత్తితో పొడిచి చంపిన తనయుడు

2025-03-03 06:35:14.0

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని కనికరం లేకుండా కత్తితో దాడి చేసి ఎనిమిదిసార్లు పొడిచాడు ఓ కసాయి కోడుకు. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ దివినో విల్లాస్‌లో నివాసముం టున్న రాధిక (52) ను ఆమె కొడుకు కార్తీక్ రెడ్డి ఉదయం ఆస్తి కోసం తల్లితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఆస్తి కోసం తల్లి పై కత్తితో దారుణంగా చేశాడు కొడుకు. గమనించిన స్థానికులు రాధికను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాధిక మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కార్తిక్‌ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితుడు మత్తు పదార్థాలు సేవిస్తూ, మద్యానికి బానిసైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sangareddy District,Telapur,Radhika,Crime news,Telangana police,DGP Jitender,CM Revanth reddy