ఆ ఏటీఎం.. ఇప్పుడు ఇంపార్టెంట్ మిష‌న్‌గా మారిందా? ప్రధాని మోడీని ఎద్దేవా చేసిన డీఎంకే ఎంపీ

2024-07-25 06:58:09.0

2019లో రాజమండ్రిలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందంటూ మీరు చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా? అని ప్రశ్నించారు

https://www.teluguglobal.com/h-upload/2024/07/25/1347026-dmk-mp-asks-pm-modi-whether-polavaram-has-become-an-important-machine.webp

పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంలా మారిందని, నిధులు దోచుకున్నారని విమర్శించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఇప్పుడు ఆ ఏటీఎం ‘ఇంపార్టెంట్ మిష‌న్‌’గా మారిందా అంటూ తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ లోక్‌సభలో ప్రశ్నించారు. బుధవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ ప్రధాని తీరును ఎద్దేవా చేశారు.

2019లో రాజమండ్రిలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందంటూ మీరు చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా? అని ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు మరిచిపోయారా అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

2014లో ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబుకు నాలుగు నెలల పాటు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని మారన్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రధాని మోడీ రాజకీయ అవసరాల కోసం ఒకటి, రెండు రాష్ట్రాలకే నిధులు కేటాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పదేళ్లుగా తమ రాష్ట్రానికి సహాయం చేయాలని కోరుతున్నా ఆయన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

DMK MP,Asks,PM Modi,Polavaram,ATM,Important machine