2024-10-23 06:46:58.0
https://www.teluguglobal.com/h-upload/2024/10/23/1371655-prabhas.webp
బాహుబలి ప్రభాస్ బర్త్ డే నేడు.. విషెస్ చెబుతున్న అభిమానులు, సెలబ్రిటీలు
హీరో ప్రభాస్ తన నటనతో అనతికాలంలోనే కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో ప్రభాస్ ఇంటి భోజనం తినని వారుండరంటే అతిశయోక్తి కాదు. అలా తన ఆతిథ్యంతోనూ ప్రత్యేకతను చాటుకున్న ఈ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా ప్రముఖులంతా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అభిమానులు, సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆ కటౌట్ చూసి అన్నీ నమ్మేయాలి డ్యూడ్ అంటూ పోస్ట్ పెట్టారు. ‘ఆ కటౌట్ చూసి అన్నీ నమ్మేయాలి డ్యూడ్ . అతను ప్రేమించే పద్ధతి చూసి.. తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభాస్. లవ్ యూ’ అని రాసుకొచ్చారు.
ప్రముఖ రచయిత పరుచూరి గోపాల కృష్ణ ప్రభాస్‌కు ప్రత్యేకంగా విషెస్ చెప్పారు. ‘ఈశ్వర్‌గా వెండితెరపై ప్రత్యక్షమై, వర్షంతో అభిమానుల హర్షంతో మురిసి, ఛత్రపతితో అలరించి, బుజ్జిగాడుగా మురిపించి, ప్రేక్షక హృదయాలలో మిస్టర్ పర్ఫెక్ట్‌గా, అందరి డార్లింగ్‌గా స్థానం సంపాదించి, మాస్ ప్రేక్షకులకు మిర్చి రుచి చూపించి, బాహుబలిగా సమున్నత స్థానం సంపాదించి, సలార్‌గా, కల్కిగా మెప్పించి, నన్ను పెదనాన్న అని గౌరవించిన ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ శతమానం భవతు.. శతాయుష్మా న్ భవ, వెండి తెర రారాజుగా విలసిల్లు’ అని రాసుకొచ్చారు.
Pan-India fame Prabhas,celebrates 45th birthday,Fans and celebrities,saying wishes,Megastar Chiranjeevi