ఆ చక్రవ్యూహాన్ని విచ్ఛిన్నం చేశా!

2024-11-23 11:18:33.0

మరాఠ ప్రజలంతా మోదీ వెంటే నిలిచారు : దేవేంద్ర ఫడ్నవీస్‌

https://www.teluguglobal.com/h-upload/2024/11/23/1380299-fadnavis.webp

మహారాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులు, నాయకుల మద్దతుతో విపక్షాలు సంధించిన చక్రవ్యూహాన్ని విచ్ఛిన్నం చేశానని డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మరాఠా ప్రజలంతా నరేంద్రమోదీ వెంటనే నిలిచారని.. అందుకే ఈ స్థాయిలో ఫలితాలు వచ్చాయన్నారు. ఈ భారీ విజయంలో కీలకంగా నిలిచిన మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. విపక్షాలు ప్రజలను నమ్మించేందుకు అనేక తప్పుడు ఆరోపణలు, బూటకపు ప్రచారాలు చేశాయని.. మతం ఆధారంగా ఓటర్లను వేరు చేయడం లాంటి ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. మహారాష్ట్రకు తదుపరి సీఎం ఎవరు అనేది బీజేపీ, శివసేన (శిందే), ఎన్‌సీపీ (అజిత్‌ పవార్‌) పార్టీల నాయకులు కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. సీఎం ఏక్‌నాథ్‌ శిందే సారథ్యంలోని శివసేన పార్టీనే అసలైన శివసేన అని ప్రజలు తమ తీర్పుతో స్పష్టం చేశారన్నారు. ఈ విజయంలో తన పాత్ర చాలా చిన్నదేనని చెప్పారు.

Maharashtra,Assembly Elections,Mahaayuti,BJP,Shivsena (Shinde),NCP (Ajith Pawer),Devendra Fadnavis