ఆ చిన్నారి పేరు మహాకుంభ్‌

2024-12-30 12:29:00.0

కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో ప్రసవం.. పేరు పెట్టిన కుటుంబ సభ్యులు

https://www.teluguglobal.com/h-upload/2024/12/30/1390303-maha-kumbh.webp

మహాకుంభమేళాకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తుల అవసరాల కోసం గంగా నది సమీపంలో ఇటీవల తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. సమీపంలో నివసించే సోనమ్‌ అనే మహిళకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆదివారం అర్ధరాత్రి తాత్కాలిక ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమెకు వైద్యులు డెలివరీ చేశారు. పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చారు. వైద్యులు ఆ చిన్నారికి వేద్‌ అని పేరు పెట్టాలని సూచించగా, కుంభమేళాకు ముందు పుట్టడంతో మహాకుంభ్‌ అని పేరు పెట్టారు. ఆ చిన్నారిని నెటిజన్లు ఆశీర్వదిస్తున్నారు.

Kumbh Mela,Prayagraj,Temporary Hospital,Baby Boy,Maha Kumbh