ఆ నాలుగు కార్ల‌తో `సై అంటే సై` కానీ.. మ‌హీంద్రా ఎక్స్‌యూవీ300 ట‌ర్బో స్పోర్ట్ మ‌రింత కాస్ట్‌లీ.. ఎందుకంటే?!

https://www.teluguglobal.com/h-upload/2023/05/14/500x300_763309-mahindra-xuv300-turbo-sport-price-hike.webp
2023-05-14 06:52:06.0

బీఎస్‌-6 ప్ర‌మాణాల‌ ప్ర‌కారం గ‌త నెల ఒక‌టో తేదీ నుంచి రియ‌ల్ డ్రైవింగ్ ఎమిష‌న్ (ఆర్‌డీఈ)ను ప్ర‌తి కారులోనే అమ‌ర్చాల్సి ఉంటుంద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఆర్డీఈ ఏర్పాటు ప్ర‌క్రియ కాస్ట్‌లీ వ్య‌వ‌హారం. ఫ‌లితంగా అన్ని ర‌కాల కార్ల త‌యారీ ధ‌ర‌లు పెరిగిపోయాయి.

క‌ర్బ‌న ఉద్గారాల నియంత్ర‌ణకు కేంద్రం రెండోద‌శ బీఎస్‌-6 ప్ర‌మాణాల‌ను అమ‌ల్లోకి తీసుకొచ్చింది. దీని ప్ర‌కారం ప్ర‌తి కార్ల తయారీ సంస్థ గ‌త నెల ఒక‌టో తేదీ నుంచి రియ‌ల్ డ్రైవింగ్ ఎమిష‌న్ (ఆర్‌డీఈ)ను ప్ర‌తి కారులోనే అమ‌ర్చాల్సి ఉంటుంద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఆర్డీఈ ఏర్పాటు ప్ర‌క్రియ కాస్ట్‌లీ వ్య‌వ‌హారం. ఫ‌లితంగా అన్ని ర‌కాల కార్ల త‌యారీ ధ‌ర‌లు పెరిగిపోయాయి. ఆ బాట‌లోనే మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ప్ర‌యాణిస్తున్న‌ది.

మారుతి సుజుకి బ్రెజా మొద‌లు రెనాల్ట్ కైగ‌ర్‌, టాటా నెక్సాన్ , హ్యుండాయ్ వెన్యూ ఎన్ లైన్ వంటి ఎస్‌యూవీ కార్ల‌తో మార్కెట్లో త‌ల‌ప‌డుతున్న‌ది మ‌హీంద్రా ఎక్స్‌యూఈ300 ట‌ర్బో స్పోర్ట్ డ‌బ్ల్యూ8 టీజీడీఐ. రెండోద‌శ బీఎస్‌-6 నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా మ‌హీంద్రా ఎక్స్‌యూఈ300 ట‌ర్బో స్పోర్ట్ డ‌బ్ల్యూ8 టీజీడీఐ`లో మార్పులు చేర్పులు చేసింది. ద‌రిమిలా దాని ధ‌ర క‌నీసం రూ.34 వేలు పెరుగుతుంది. హై ఎండ్ ధ‌ర రూ.43 వేలు పెరుగుతుంది.

మ‌హీంద్రా ఎక్స్‌యూఈ300 ట‌ర్బో స్పోర్ట్ డ‌బ్ల్యూ8 (ఓ) టీజీడీఐ డ్యుయ‌ల్ టోన్ వేరియంట్ ధ‌ర రూ.40 వేలు పెరిగి రూ.13.30 ల‌క్ష‌లు ప‌లుకుతుంది. ప్ర‌స్తుతం ఈ కారు ధ‌ర రూ.10.71-13.30 ల‌క్ష‌ల మ‌ధ్య అందుబాటులో ఉంటుంది.

బీఎస్‌-6 2.0కి అనుగుణంగా మ‌హీంద్రా ఎక్స్‌యూఈ300 ట‌ర్బో స్పోర్ట్ డ‌బ్ల్యూ8 టీజీడీఐ కారులో ఆర్డీఈ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా 1.2 లీట‌ర్ల ట‌ర్బో చార్జ్‌డ్ ఎం-స్టాలియ‌న్ పెట్రోల్ ఇంజిన్‌, గ‌రిష్టంగా 126 హెచ్‌పీ విద్యుత్‌, 230 ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తుంది. ఓవ‌ర్ బూస్ట్ ఫంక్ష‌న్ కోసం ఇంజిన్ 250 ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తుంది. ఈ కారు ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువ‌ల్ గేర్ బాక్స్‌తో రూపుదిద్దుకున్న‌ది.

ఎక్స్‌యూఈ300 ట‌ర్బో స్పోర్ట్ డ‌బ్ల్యూ8 టీజీడీఐ ధ‌ర‌లు వేరియంట్ వారీగాః

ఎక్స్‌యూఈ300 వేరియంట్ ————— పాత ధ‌ర ————– కొత్త ధ‌ర ————– తేడా (రూ.ల్లో)

ట‌ర్బో స్పోర్ట్ డ‌బ్ల్యూ6 ———————- రూ.10.35 ల‌క్ష‌లు —— రూ.10.71 ల‌క్ష‌లు —– రూ.34 వేలు

ట‌ర్బో స్పోర్ట్ డ‌బ్ల్యూ8 ———————- రూ.11.65 ల‌క్ష‌లు —— రూ.12.02 ల‌క్ష‌లు —– రూ.37 వేలు

ట‌ర్బో స్పోర్ట్ డ‌బ్ల్యూ8 డ్యుయ‌ల్ టోన్ —– రూ.11.80 ల‌క్ష‌లు —— రూ.12.14 ల‌క్ష‌లు —– రూ.34 వేలు

ట‌ర్బో స్పోర్ట్ డ‌బ్ల్యూ8 (ఓ) —————— రూ. 12.75 ల‌క్ష‌లు —– రూ.13.18 లక్ష‌లు —- రూ.43,000

ట‌ర్బో స్పోర్ట్ డ‌బ్ల్యూ8 (ఓ) డ్యుయ‌ల్ టోన్ — రూ. 12.90 ల‌క్ష‌లు —– రూ.13.30 లక్ష‌లు —- రూ.40,000

Mahindra,XUV300,Turbo Sport,Price hike
Mahindra, XUV300, Turbo Sport, Price hike

https://www.teluguglobal.com//business/mahindra-xuv300-turbo-sport-price-hike-932834