2024-12-12 15:11:34.0
వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్
https://www.teluguglobal.com/h-upload/2024/12/12/1385363-stalin.webp
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టబోతుందని.. ఇది ప్రాంతీయ పార్టీల గొంతులను అణచి వేయడమేనని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. కేంద్ర కేబినెట్ నిర్ణయంపై గురువారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. జమిలి ఎన్నికలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థకే విఘాతం కలిగిస్తాయన్నారు. ఈ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడం క్రూరమైన చర్య అన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. దీనిని దేశ ప్రజలందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
One Nation – One Election,Narendra Modi,MK Stalin,Reginal Parties,Strangle