http://www.teluguglobal.com/wp-content/uploads/2016/02/Poison-Fruits.jpg
2016-02-02 06:50:18.0
మంచి పోషకాహారం అనగానే మనకు గుర్తొచ్చేది పళ్లే. ఎలాంటి అనుమానం లేకుండా హాయిగా తినగలిగినవి, కల్తీకి వీలులేనివి పళ్లే కదా అనుకుంటాం మనం. అయితే సహజసిద్ధంగా ప్రకృతి అందించే వాటిని సైతం వాటి అమ్మకం దారులు కలుషితం చేస్తున్నారు, వాటిలో విషాన్ని నింపుతున్నారు. ఇది మనం అంటున్న, వింటున్న మాటే కాదు, సాక్షాత్తూ హైకోర్టు ధర్మాసనం కూడా ఇలాగే అభిప్రాయపడింది. పళ్లను కాల్షియం కార్బైడ్ సహాయంతో పండించి అమ్మడంపై వస్తున్న పత్రికా కథనాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి […]
మంచి పోషకాహారం అనగానే మనకు గుర్తొచ్చేది పళ్లే. ఎలాంటి అనుమానం లేకుండా హాయిగా తినగలిగినవి, కల్తీకి వీలులేనివి పళ్లే కదా అనుకుంటాం మనం. అయితే సహజసిద్ధంగా ప్రకృతి అందించే వాటిని సైతం వాటి అమ్మకం దారులు కలుషితం చేస్తున్నారు, వాటిలో విషాన్ని నింపుతున్నారు. ఇది మనం అంటున్న, వింటున్న మాటే కాదు, సాక్షాత్తూ హైకోర్టు ధర్మాసనం కూడా ఇలాగే అభిప్రాయపడింది. పళ్లను కాల్షియం కార్బైడ్ సహాయంతో పండించి అమ్మడంపై వస్తున్న పత్రికా కథనాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. సోమవారం విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారధి ధర్మాసనం ముందు హాజరయ్యారు.
పళ్లను కృత్రిమంగా కార్బైడ్‌తో పక్వానికి తేవడం, గేదెలకు హార్మోన్ ఇంజక్షన్లను ఇచ్చి ఎక్కువ పాలు పిండటం తదితర అంశాలు ధర్మాసనం ముందుకు వచ్చాయి. ఈ సందర్భంలోనే అన్ని జిల్లాల నుండి తాము తెప్పించి పరిశీలించిన పళ్ల శాంపిళ్లలో 94శాతం తినడానికే పనికిరావని తేలిందని ధర్మాసనం వెల్లడించింది. సరిపడా సిబ్బందిని తీసుకుని విస్తృతంగా తనిఖీలు నిర్వహించమని ఆదేశించింది. సామాజిక మాధ్యమాలను ఉపయోగించి ప్రజలకు కార్బైడ్ వలన కలిగే నష్టాలను గురించి చెప్పాలని సూచించింది. పళ్లను కొనేవారికి, అమ్మేవారికి ఈ విషయాలపై అవగాహన కల్పించడం, విస్తృతంగా తనిఖీలు, పట్టుబడితే తగిన శిక్షలు ఇవన్నీ చేపటిడితే కానీ పళ్లు విషాలుగా మారకుండా ఉంటాయి. మన ఆరోగ్యాలు పాడవకుండా ఉంటాయి.
Fruits,Poison Fruits
https://www.teluguglobal.com//2016/02/02/poison-in-fruits/