ఆ పాల బుగ్గల మాజీ కీపర్‌.. గుజరాత్‌ బ్యాటింగ్‌ కోచ్‌

https://www.teluguglobal.com/h-upload/2024/11/13/1377426-parthiv-patel.webp

2024-11-13 11:05:34.0

ప్రకటించిన గుజరాత్‌ టైటాన్స్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌

 

పాల బుగ్గల వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ ను గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ గా నియమించారు. ఈమేరకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ ప్లేయర్‌ గ్యారి కిర్‌స్టన్ ప్లేస్‌ లో పార్థివ్‌ పటేల్‌ బ్యాటింగ్‌ కోచ్‌ బాధ్యతలు చేపడుతారు. పార్థివ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కు 2020లో రిటైర్మెంట్‌ ప్రకటించారు. భారత్‌ తరపున 25 టెస్ట్‌ మ్యాచ్‌లు, 38 వన్డేలు, రెండు టీ 20 మ్యాచ్‌ లు ఆదారు. ఐపీఎల్‌ లో 2008 నుంచి 2019 వరకు ఆరు ప్రాంచైజీల తరపున పార్థివ్‌ ఆడారు. 139 ఐపీఎల్‌ మ్యాచుల్లో 13 హాఫ్‌ సెంచరీలతో 2,848 పరుగులు చేశాడు. 69 క్యాచ్‌ లు, 16 స్టంపింగ్‌ లు చేశాడు.