2023-05-27 10:18:58.0
https://www.teluguglobal.com/h-upload/2023/05/27/771505-puvu.webp
ఆ..పువ్వుకీ
ఆ..నెలకీ …
ఏదో ….
అవినాభావ-
సంబంధం ఉంది !
ఆనెలలో పుష్పించి
అదేనెలలో వడలిపోయే
ఆ.పువ్వు…
మండుతున్న
అగ్నిగోళంలా
ఎర్రగాగుండ్రంగా
చూడ్డానికి అందంగా
ఆహ్లాదం కలిగిస్తుంది !
యెర్రని ఎండతో
జతకట్టే ఆ ..పుష్పం
ఆనెలలో తప్ప ..
మిగతకాలం
మట్టిదుప్పటి కప్పుకుని
దుంపగా -సుషుప్త –
దశకుచేరి –
నేలలో మిగిలిపొతుంది
సంవత్సరానికోసారి
కళ్లు తెరుస్తుంది ….!
వాసన లేకున్నా …
పూజకుపనికిరాకున్నా ,
అందంతో అందరిని
ఆకర్షిస్తుంది ….అదే
మే -నెలలో మాత్రమే
పుష్పించే —
మే —ఫ్లవర్ …..!
అదే ..’ మే -పుష్పం” !!
డా.కె.ఎల్.వి.ప్రసాద్.
(హన్మకొండ)
Aa Puvvu,Dr KLV Prasad,Telugu Kavithalu