http://www.teluguglobal.com/wp-content/uploads/2016/05/pasupu.gif
2016-05-01 11:24:10.0
పసుపులో యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ డైరక్టర్ గోవిందరాజన్ పద్మనాభన్ ఇదే విషయంమీద మాట్లాడుతూ పసుపులో ఉన్న కర్‌క్యుమిన్ అనే పదార్థమే పసుపుకి ఆ రంగుని ఇస్తుందని, అదే పసుపుకి, వాపుకి వ్యతిరేకంగా పోరాడే గుణాన్ని ఇస్తుందని అన్నారు. పసుపు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థని ప్రభావితం చేసి యాంటీబాడీలను ఉత్పత్తి చేసేందుకు ప్రేరేపిస్తుందని, ఈ యాంటీ బాడీలు మలేరియాపై పోరాటం చేస్తాయని ఆయన అన్నారు. ఆర్‌టిమిసినిన్ […]
పసుపులో యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ డైరక్టర్ గోవిందరాజన్ పద్మనాభన్ ఇదే విషయంమీద మాట్లాడుతూ పసుపులో ఉన్న కర్‌క్యుమిన్ అనే పదార్థమే పసుపుకి ఆ రంగుని ఇస్తుందని, అదే పసుపుకి, వాపుకి వ్యతిరేకంగా పోరాడే గుణాన్ని ఇస్తుందని అన్నారు. పసుపు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థని ప్రభావితం చేసి యాంటీబాడీలను ఉత్పత్తి చేసేందుకు ప్రేరేపిస్తుందని, ఈ యాంటీ బాడీలు మలేరియాపై పోరాటం చేస్తాయని ఆయన అన్నారు. ఆర్‌టిమిసినిన్ అనే ఒక చైనా మెడిసిన్‌తో పసుపులో ఉన్న కర్‌క్యుమిన్‌ని కలిపి వాడితే సెరిబ్రెల్ మలేరియాకు అద్భుతంగా పనిచేసినట్టుగా పద్మనాభన్ బృందం చేసిన పరిశోధనల్లో తేలింది.
కర్‌క్యుమిన్ ఒక్కటే దీనికి విరుగుడుగా పనిచేయకపోయినా, ఆర్‌టిమిసినిన్‌తో కలిపి ఒక నిర్దిష్ట పరిమాణంతో వాడినప్పుడు సెరిబ్రల్ మలేరియాపై పూర్తి స్థాయిలో పనిచేసినట్టుగా ఆయన తెలిపారు. జంతువులకు కృత్రిమంగా ఇన్‌ఫెక్షన్‌ని కలిగించి, వాటిపై ఈ మందుని వినియోగించి చూశారు. ఈ ఫలితాన్ని మనుషుల్లో చూసేందుకు ఈ సంవత్సరం చివర్లో దాదాపు 100 మంది పేషంట్ల మీద ఒక అధ్యయనాన్ని నిర్వహించనున్నట్టుగా ఆయన తెలిపారు.
https://www.teluguglobal.com//2016/05/01/ఆ-రంగులోనే-ఉంది-అసలు-సంగ/