2024-12-31 11:28:38.0
మణిపుర్ సీఎం బీరేన్ సింగ్ ప్రజలను క్షమాపణలు చెప్పారు
https://www.teluguglobal.com/h-upload/2024/12/31/1390518-singh.webp
మణిపుర్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ క్షమాపణలు చెప్పారు. గతేడాది మణిపుర్‌లో నెలకొన్న పరిస్థితులపై మరోసారి స్పందించారు. ఈ ఏడాదంతా దురదృష్టకరంగా గడిచిందని.. అందుకు రాష్ట్ర ప్రజలను సారీ చెప్పారు. గత సంవత్సరం మే 3 నుండి ఈ రోజు వరుకు జరుగుతున్న దానికి చింతిస్తున్నాను ప్రియమైన వారిని కోల్పోయారు. ప్రజలు తమ ఇళ్లను విడిచి పెట్టి వెళ్లిపోయారు. గత తప్పిదాలను మరచిపోయి శాంతియుతమైన జీవితాన్ని ప్రారంభించాలని కోరుతున్నాను అని ముఖ్యమంత్రి అన్నారు.
‘రాష్ట్రంలో 12 వేలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 625 మంది నిందితులు అరెస్టయ్యారు. 5,600 ఆయుధాలు, 35 వేల మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత మూడు, నాలుగు నెలలుగా రాష్ట్రంలో శాంతి నెలకొనడాన్ని చూస్తూనే ఉన్నాం. మణిపుర్ క్షేమం కోసం తగిన భద్రతా సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం పంపింది. అంతేకాకుండా.. నిర్వాసితుల కోసం నిధులను సమకూర్చింది. త్వరలో గృహా నిర్మాణాలు చేపడతాం. వచ్చే ఏడాది నుంచి శాంతి స్థాపన జరుగుతుందని ఆశిస్తున్నా’’ అని విశ్వాసం వ్యక్తం చేశారు.
Manipur,CM N Biren Singh,Cookie,Meitei,Clashes,Manipur police,Pm modi,minister amit shah