http://www.teluguglobal.com/wp-content/uploads/2016/05/weight-loss.gif
2016-05-06 05:12:20.0
చిన్నతనం నుండి మధ్య వయసు వరకు అధికబరువుతోనే ఉండేవారికి జీవితకాలం, సన్నగా ఉన్నవారితో పోలిస్తే తక్కువగా ఉంటుందని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. 80,266మంది పురుషులు, 36,622 మంది స్త్రీలపై ఈ భారీ అధ్యయనాన్ని సుదీర్ఘకాలం నిర్వహించారు. నర్సులు, ఆరోగ్య నిపుణులు దీంట్లో పాలుపంచుకున్నారు. అధ్యయనంలో పాల్లొన్నవారి శరీర బరువు వారు 5.10,20,30,40 సంవత్సరాల వయసుల్లో సుమారుగా ఎంత ఉందో తెలుసుకున్నారు. 50 సంవత్సరాల వయసులో కూడా వారి బాడీ మాస్ ఇండెక్స్ ఎలా ఉందో తెలుసుకుని […]
చిన్నతనం నుండి మధ్య వయసు వరకు అధికబరువుతోనే ఉండేవారికి జీవితకాలం, సన్నగా ఉన్నవారితో పోలిస్తే తక్కువగా ఉంటుందని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. 80,266మంది పురుషులు, 36,622 మంది స్త్రీలపై ఈ భారీ అధ్యయనాన్ని సుదీర్ఘకాలం నిర్వహించారు. నర్సులు, ఆరోగ్య నిపుణులు దీంట్లో పాలుపంచుకున్నారు. అధ్యయనంలో పాల్లొన్నవారి శరీర బరువు వారు 5.10,20,30,40 సంవత్సరాల వయసుల్లో సుమారుగా ఎంత ఉందో తెలుసుకున్నారు. 50 సంవత్సరాల వయసులో కూడా వారి బాడీ మాస్ ఇండెక్స్ ఎలా ఉందో తెలుసుకుని 60 ఏళ్ల వయసునుండి వారి ఆరోగ్య స్థితి గతులను అధ్యయనం చేయటం మొదలుపెట్టారు. కనీసం 15-16 ఏళ్లు అంటే దాదాపు వారి మరణం వరకు అధ్యయనం కొనసాగించారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి పార్టిసిపేట్ చేసినవారి జీవనశైలి, ఆరోగ్య విశేషాలను తెలుసుకున్నారు. ఈ మొత్తం అధ్యయనంలో ఎవరైతే జీవితాంతం సన్నగా ఉన్నారో వారిలో… అధ్యయనం నిర్వహించిన 15 ఏళ్ల కాలంలో మరణించే రిస్క్ ఆడవారిలో 11.8శాతం, మగవారిలో 20.3శాతంగా ఉండటం గమనించారు. అదే చిన్నతనం నుండీ బరువు ఎక్కువగా ఉండీ, అది వయసుతో పాటు కొనసాగినవారిలో, ముఖ్యంగా మధ్యవయసులో బరువుపెరిగిన వారిలో 15 ఏళ్లలో మరణ ప్రమాదం ఆడవారిలో 19.7శాతం, మగవారిలో 24.1శాతంగా ఉండటం గుర్తించారు. ఈ అధ్యయన ఫలితాలను వెల్లడించిన నిర్వాహకులు దీర్ఘకాలం జీవించాలనుకుంటే నడి వయసులో బరువుపెరగకుండా నివారించుకోవాలని హెచ్చరించారు. మొత్తంమీద వయసు పెరుగుతున్న కొద్దీ పెరుగుతున్న బాడీ మాస్ ఇండెక్స్… తప్పనిసరిగా జీవితకాలాన్ని తగ్గించి మరణానికి చేరువ చేస్తుందని ఒక అంతర్జాతీయ పరిశోధకుల బృందం తదుపరి పరిశోధనలో తేల్చి చెప్పింది. ఈ వివరాలను యునైటెడ్ కింగ్‌డమ్ నుండి ప్రచురితమవుతున్న బిఎమ్‌జె అనే మెడికల్ పత్రికలో ప్రచురించారు.
https://www.teluguglobal.com//2016/05/06/ఆ-వయసులో-బరువు-పెరిగి/