2025-01-30 14:03:50.0
వాషింగ్టన్‌లో హెలికాఫ్టర్, విమానం ఢీ ప్రమాదంలో 64 మంది మృతి చెందినట్లేని ఫైర్ చీఫ్ పేర్కొన్నారు.
అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్ ఢీ కొన్న ఘటనలో ఎవరు బతికే అవకాశం లేదని అమెరికా అధికార ప్రకటన విడుదల చేసింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న మొత్తం 64 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అక్కడి అగ్నిమాపక శాఖ చీఫ్ వెల్లడించారు. ఇప్పటి వరకు 28 మృతదేహాలను నదిలోంచి బయటకి తీసినట్లు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.అయితే, విమానంలో ఉన్న వారెవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ఆయన తెలిపారు. గత 24 ఏళ్లలో అమెరికాలో ఇదే అతిపెద్ద ప్రమాదమన్నారు. విమానం తలకిందులుగా నది అడుగుభాగంలో కూరుకుపోయిందని, అక్కడికి దగ్గర్లోనే హెలికాప్టర్ శకలాలను కూడా గుర్తించామని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న జాన్ డొన్నెలీ పేర్కొన్నారు.
యూఎస్ఏ లోని వర్జీనియా రాష్ట్రంలోని రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లైట్ సిబ్బందితో సహా మొత్తం 64 మందితో ఓ విమాన ల్యాండ్ అవుతోంది. ఈ క్రమంలో ఫ్లైట్ పోటోమాక్ నది సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఓ మిలటరీ హెలికాప్టర్ ఆ ప్యాసింజర్ ఫ్లైట్ ను బలంగా ఢీకొట్టింది.దీంతో భారీ పేలుడు సంభవించి, విమానం, హెలికాప్టర్ పొటోమాక్ నదిలో చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే, రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్టు ల్యాండింగ్ ట్రాక్‌కు సమీపంలోనే విమానం కూలిపోయిందని అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఈ మేరకు వాషింగ్టన్ ఫైర్ డిపార్ట్‌మెంట్ఫైర్ బోట్లతో రెస్క్యూ ఆపరేషన్ చేపడుతోంది.
నదిలో కూలిన విమానం
వాషింగ్టన్‌లో హెలికాఫ్టర్, విమానం ఢీ
రోనాల్డ్ రీగన్ విమానాశ్రయం వద్ద పోటోమాక్ నదిలో కూలిన చిన్న విమానం
ఘటన సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం
ప్రమాదానికి గురైంది పీఎస్ఏ ఎయిర్‌లైన్స్ విమానంగా గుర్తింపు pic.twitter.com/J0pG38MHNN
— BIG TV Breaking News (@bigtvtelugu) January 30, 2025
America,Washington,Helicopter accident,Fire Chief John Donnelly,Military helicopter,Plane Crashes,united states,Crime news