2024-12-17 09:25:54.0
పెద్ద ఎత్తున రిటర్న్స్ అనే దానిపై కస్టమర్లను అలర్ట్ చేసిన ఎస్‌బీఐ
పెద్ద ఎత్తున రిటర్నులు.. అంటూ స్టేట్ బ్యాంక్ టాప్ మేనేజ్‌మెంట్ చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ స్పందించింది. ఇవన్నీ కేవలం నకిలీ వీడియోలు అంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓ పోస్ట్ విడుదల చేసింది.
బ్యాంక్ మేనేజ్‌మెంట్‌కు చెందిన వ్యక్తులంటూ సోషల్ మీడియాలో చక్లర్లు కొడుతున్న డీప్ ఫేక్ వీడియోలు నమ్మవద్దు. ఆ వీడియోలో పేర్కొన్న పథకాలతో బ్యాంక్‌కు గాని, బ్యాంక్ అధికారులకు గాని ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియోలో ఫలానా పథకంలో పెట్టుబడి పెట్టండంటూ ప్రజలకు సలహా ఇస్తున్నారు. ఇలాంటి అవాస్తవమైన, అసాధారణ రాబడి ఇచ్చే వాగ్దానాలు ఎస్‌బీఐ చేయదు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి అంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.
Beware,SBI Alerts Public,About Deepfake Videos,Claiming,Fake Investment Schemes,Circulate Online