2025-01-11 04:51:56.0
https://www.teluguglobal.com/h-upload/2025/01/11/1393525-samantha.webp
నటి సమంత తన ఆరోగ్యంపై పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్
నటి సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అలాగే తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఆమె తన ఆరోగ్యంపై పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. ఇటీవల తాను చికెన్ గున్యా బారిన పడినట్లు తెలిపారు. దాని నుంచి కోలుకుంటున్నట్లు చెప్పారు.
సమంత తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దీనిలో భాంగానే ఎప్పుడూ జిమ్ చేస్తుంటారు. తాజాగా ఒకవైపు చికెన్ గున్యా నుంచి కోలుకుంటూనే మరోవైపు జిమ్లో వ్యాయామం చేస్తున్నారు. ఈ విషయాన్నే ఆమె ఇన్స్టా స్టోరీ పోస్ట్ చేశారు. ‘చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్ల నొప్పుల నుంచి కోలుకోవడంలోనూ చాలా ఫన్ ఉన్నది.. అంటూ తన బాధతో కూడిన ఎమోజీలన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతున్నది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఇక సమంత నటించిన ’సిటడెల్: హనీ బన్సీ‘ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నది. ప్రియాంక చెప్రా నటించిన హాలీవుడ్ సిరీస్ సిటడెల్ కు ఇండియన్ వర్షన్. ఈ సిరీస్ తర్వాత కొంతకాలం విరామం తీసుకున్న సమంత మళ్లీ షూటింగ్స్ లో బిజీ అవుతున్నారు. మా ఇంటి బంగారం అనే మూవీ ని ఇటీవల ప్రకటించారు. అలాగే రాజ్ అండ్ డీకే డైరెక్షన్ రానున్న రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ లోనూ చేయనున్నారు.
Samantha Ruth Prabhu,Hits the gym,While recovering from chikungunya,‘Joint pains and all’,Citadel,Citadel Honey Bunny,Rakt Bramhand