2016-07-06 01:08:59.0
అధికారాన్ని ఎన్ని విధాలుగా వీలయితే అన్ని విధాలుగానూ దుర్వినియోగం చేస్తున్న కాలంలో ఈ మహిళ…గురించి వింటే ఆశ్చర్యమనిపిస్తుంది. అమెరికాలోని మైనే రాష్ట్ర గవర్నర్ పాల్ లెపేజ్ దేశంలోని గవర్నర్లలో అత్యల్ప స్థాయిలో జీతం తీసుకుంటున్నారు. ఆయన భార్య అన్ లెపేజ్. రాష్ట్ర ప్రథమ మహిళగా సర్వ భోగాలు అనుభవించే అవకాశం ఉన్నా భర్త తెచ్చే జీతంతోనే సరిపెట్టుకుంటూ బతకడం ఆమెకు అలవాటు. అన్ లెపేజ్‌కు ఇటీవల తనకంటూ ఒక స్పోర్ట్స్ కారు కావాలనిపించిందట. భర్త జీతంతో పాటు […]
అధికారాన్ని ఎన్ని విధాలుగా వీలయితే అన్ని విధాలుగానూ దుర్వినియోగం చేస్తున్న కాలంలో ఈ మహిళ…గురించి వింటే ఆశ్చర్యమనిపిస్తుంది. అమెరికాలోని మైనే రాష్ట్ర గవర్నర్ పాల్ లెపేజ్ దేశంలోని గవర్నర్లలో అత్యల్ప స్థాయిలో జీతం తీసుకుంటున్నారు. ఆయన భార్య అన్ లెపేజ్. రాష్ట్ర ప్రథమ మహిళగా సర్వ భోగాలు అనుభవించే అవకాశం ఉన్నా భర్త తెచ్చే జీతంతోనే సరిపెట్టుకుంటూ బతకడం ఆమెకు అలవాటు.
అన్ లెపేజ్‌కు ఇటీవల తనకంటూ ఒక స్పోర్ట్స్ కారు కావాలనిపించిందట. భర్త జీతంతో పాటు తన సంపాదన కూడా తోడైతే త్వరగా ఆ కోరిక తీరుతుందన్న ఉద్దేశ్యంతో ఆమె ఓ హోటల్లో వెయిట్రెస్గా పార్ట్టైమ్ జాబ్ చేస్తోంది. మెక్సీగల్స్ అనే రెస్టారెంటులో వారానికి మూడురోజులు లంచ్టైమ్లో అన్ అక్కడ వెయిట్రెస్గా కనబడుతుంది. ఎవరైనా అడిగితే తప్ప ఆమె తాను ఎవరు అన్నది చెప్పడానికి ఇష్టపడరట.
ఇటీవల ఓ రిపోర్టర్ ఈ విషయాన్ని వెలుగులోకి తేవటంతో అందరూ ఆశ్చర్యంతో తెల్లబోయారు. అన్ భర్త లెపేజ్ సైతం తన భార్య చేస్తున్న పని తనకు గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఆమెకు వెయిట్రెస్గా పనిచేయటం చాలా ఇష్టమని కూడా చెప్పుకొచ్చారు. గత ఏడాది సమ్మర్లో వీరి కుమార్తె కూడా ఇదే హోటల్లో పనిచేసింది. అమెరికాలో రాష్ట్ర గవర్నర్ల సగటు వేతనం 1,35,000 డాలర్లు ఉండగా, పాల్ లెపేజ్ 70వేల డాలర్లు మాత్రమే పొందుతున్నారు.