2025-03-01 05:51:50.0
ఏడు అడుగుల లోతైన మంచులో కూరుకుపోయిన వారిని బైటికి తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న ఆర్మీ
https://www.teluguglobal.com/h-upload/2025/03/01/1407637-uttarakhand-avalanche.webp
ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా మంచు కురుస్తుండటంతో భారీగా మంచు చరియలు విరిగిపడిన విషయం విదితమే. వాటిని తొలిగించే పనులు నిర్వర్తిస్తున్న కార్మికుల్లో 55 మంది అనూహ్యంగా వాటి కింద చిక్కుకున్నారు. తొలిరోజు 33 మంది రక్షించగా.. రెండో రోజు మరో 14 మందిని ఆర్మీ రక్షించింది. ఇంకా 8 మంది మంచుచరియల కిందే చిక్కుకుని ఉన్నారు.మంచుతో కూడిన వర్షం దట్టంగా కురుస్తుండటం, చీకటి కారణంగా సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది.కాపాడిన వారిలో 4 గురి పరిస్థితి విషమంగా ఉన్నదని అధికారులు తెలిపారు. ఏడు అడుగుల లోతైన మంచులో కూరుకుపోయిన వారిని బైటికి తీయడానికి ఆర్మీ తీవ్రంగా శ్రమిస్తున్నది.సహాయక చర్యలు జరుగుతున్న చోటికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ వచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు.
Avalanche Rescue,8 Workers,Still Trapped In Uttarakhand,Uttarakhand State Disaster Management Authority,Chief minsiter Pushkar Singh Dhami