2025-01-30 08:39:09.0
సీజీజీ పోర్టల్‌లో సాంకేతిక సమస్యతో అంతరాయం
తెలంగాణలో ఇంటర్ హాల్‌టికెట్ల జారీలో ఇబ్బందులు నెలకొన్నాయి. సీజీజీ పోర్టల్‌లో సాంకేతిక సమస్యతో ఈ అంతరాయం ఏర్పడింది. దీంతో హాల్‌టికెట్ లేకున్నా విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫీజు చెల్లించిన, చెల్లించని వారి జాబితాలు సిద్ధం చేయాలని చెప్పింది. హాల్‌టికెట్ రాని వారి జాబితా సిద్ధం చేయాలని సిబ్బందిని బోర్డు ఆదేశించింది.
TS Inter Hall Tickets,Difficulties,Issuance,CGG Portal,Technical Issues