2024-12-10 12:40:01.0
https://www.teluguglobal.com/h-upload/2024/12/10/1384787-sss.webp
సినీ నటుడు మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డిని కలిశారు.
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ఇంట్లో హైడ్రామా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డిని మంచు మనోజ్, మౌనికతో కలిసి రక్షణ కల్పించాలని ఇంటెలిజెన్స్ డీజీని కోరారు. తన ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించారు. తనకు, తన భార్యకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. మంచు మనోజ్, మౌనిక కారులో వచ్చిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ తర్వాత మంచు మనోజ్ తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డిని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలియజేస్తూ రాచకొండ సీపీకి ఇప్పటికే మోహన్ బాబు లేఖ రాశారు. తనకు రక్షణ కల్పించాలని రాచకొండ సీపీని విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు మంచు మనోజ్ పహాడిషరీఫ్‌లో తనపై 10 మంది వ్యక్తులు దాడి చేశారని, విజయ్, కిరణ్ సీసీటీవీ పుటేజ్ తీసుకెళ్లారని.. తనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడని తెలిసిందే. మరోవైపు జల్‌పల్లి మోహన్‌బాబు ఇంటి నుంచి మంచు మనోజ్ సామగ్రిని వెహికల్ లో తరలించేందుకు వాహనాలు సిద్ధం చేస్తున్నారు. మనోజ్ ఉంటుంది.. మోహన్ బాబు ఇల్లు కావడంతో మనోజ్ రావడానికి వీలు లేదంటున్నారు మోహన్ బాబు. దాంతో మూడు వాహనాల్లో సామగ్రిని తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎలాంటి గొడవలకు తావులేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసారు. పోలీసుల సహాయంతో మనోజ్ సామగ్రిని తలించనున్నారు సిబ్బది. అయితే ఇప్పటికే తనకు భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్ డీజీని మంచు మనోజ్ కలిసి కోరారు
Manchu Family,Mohan Babu,Manchu Manoj,Manchu Lakshmi,Maunika,Jalpalli Hyderabad,Bouncers,Intelligence DG Shivdhar Reddy,DGP Jitender Reddy