https://www.teluguglobal.com/h-upload/2023/07/26/500x300_800260-soap.webp
2023-07-26 05:44:14.0
సబ్బుని ఎవరైనా వినియోగించిన తరువాత దానిని వాడినవారి శరీరంపైన ఉండే బ్యాక్టీరియా సబ్బుపైన ఉండిపోతుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.
చాలా ఇళ్లలో కుటుంబ సభ్యులందరూ ఒకే సబ్బుని వాడుతుంటారు. ఇంట్లో ఎవరికైనా చర్మ సమస్యలు లేదా అంటువ్యాధులు ఉంటేనే వేరు సబ్బు ఉండాలని … అలాంటివేమీ లేకపోతే అందరూ ఒకే సబ్బుని వాడవచ్చని చాలామంది అనుకుంటారు. కానీ అది సురక్షితం కాదంటున్నారు నిపుణులు. సబ్బులు మన చర్మాన్ని శుభ్రం చేయవచ్చు కానీ వాటిని అవి మాత్రం శుభ్రం చేసుకోవు… అంటే సబ్బుతో స్నానం చేసిన వ్యక్తి ఒంటిపై ఉన్న బ్యాక్టీరియా సబ్బుని చేరే అవకాశం ఉంటుంది. సబ్బుని ఎవరైనా వినియోగించిన తరువాత దానిని వాడినవారి శరీరంపైన ఉండే బ్యాక్టీరియా సబ్బుపైన ఉండిపోతుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే పబ్లిక్ టాయ్ లెట్లలో సబ్బులను ఉంచరు.
2015లో ఓ హాస్పటల్ లో నిర్వహించిన అధ్యయనంలో అక్కడ వినియోగిస్తున్న సబ్బుల్లో 62శాతం కలుషితమై ఉన్నట్టుగా తేలింది. సబ్బుల ద్వారా బ్యాక్టీరియా ఒకరినుండి ఒకరికి వ్యాపించే అవకాశం తీవ్రంగా ఉంటుంది. సబ్బులపై ఈ కొలీ, సాల్మొనెల్లా, షిగెల్లా లాంటి బ్యాక్టీరియా అలాగే నోరో, రోటా లాంటి వైరస్ లు చేరే ప్రమాదం ఉందని కూడా అధ్యయనాల్లో తేలింది. గాయాలు, పుళ్లు ఉన్నవారు వినియోగించిన సబ్బుని మరొకరు వాడినప్పుడు బ్యాక్టీరియా వారినుండి ఇతరులకు చేరే ప్రమాదం ఉంది.
సబ్బు వాడకంలో జాగ్రత్తలు
-సబ్బుని వాడిన తరువాత దానిని శుభ్రంగా నీళ్లతో కడగాలి.
-ఇరవై నుండి ముప్పయి సెకన్లపాటు నురగవచ్చేలా కడగాల్సి ఉంటుంది.
-సబ్బుని గాలి తగిలేలా ఉంచాలి. సబ్బు పెట్టెలో నీళ్లు నిల్వ ఉండకుండా బయటకు వెళ్లిపోతుండాలి.
-సబ్బుకి బదులుగా లిక్విడ్ హ్యాండ్ సోప్ ని, లిక్విడ్ బాడీ వాష్ ని వాడటం మంచిది.
Soap,Health Tips,infection,Hygiene,bacteria
soap, sharing, infection, hygiene, bacteria, telugu news, telugu global news, health news, health tips
https://www.teluguglobal.com//health-life-style/is-it-ok-to-share-the-same-soap-with-your-family-950381