ఇంట్లో ఈ మొక్కలు ఉంటే బోలెడు బెనిఫిట్స్!

https://www.teluguglobal.com/h-upload/2024/06/20/500x300_1338151-medicinal-plants.webp
2024-06-20 20:37:14.0

అందంగా కనిపించే ఫ్యాన్సీ ఇండోర్ మొక్కలకు బదులు కొన్ని ఔషధ గుణాలున్న మొక్కలు పెంచితే అటు పొల్యూషన్ పరంగానూ ఇటు ఆరోగ్యంపరంగానూ హెల్ప్ అవుతుంది.

పొల్యూషన్ కారణంగా బయట స్వచ్ఛమైన గాలి దొరకడం లేదని చాలామంది ఇంట్లోనే మొక్కలు పెంచుతున్నారు. అయితే అన్ని రకాల మొక్కలు గాలిని క్లీన్ చేయలేవు. గాలిలోని రసాయనాలను క్లీన్ చేసే లక్షణం కొన్ని ప్రత్యేకమైన మొక్కలకు మాత్రమే ఉంటుంది. అవేంటంటే..

అందంగా కనిపించే ఫ్యాన్సీ ఇండోర్ మొక్కలకు బదులు కొన్ని ఔషధ గుణాలున్న మొక్కలు పెంచితే అటు పొల్యూషన్ పరంగానూ ఇటు ఆరోగ్యంపరంగానూ హెల్ప్ అవుతుంది. ఇంట్లో పెంచుకోగలిగే కొన్ని ఔషధ మొక్కలు ఇవే..

తులసి

తులసి మంచి యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది. అంతేకాదు, జ్వరం, జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలకు తులసి ఆకులు మంచి మెడిసిన్‌గా పనిచేస్తాయి. అంతేకాకుండా తులసి అజీర్ణం, తలనొప్పి, మూర్ఛ, నిద్రలేమి, మలేరియా లాంటి సమస్యలను నయం చేయడంలోనూ సాయపడుతుంది.

మెంతి

మెంతి మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. మెంతి ఆకులు గాల్లో బ్యాక్టీరియాలను నశింపజేస్తాయి. అలాగే వీటి ఆకులతో బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయి. వీటితో లివర్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు. కడుపులోమంట, అల్సర్ వంటి వాటికి మెంతి ఆకులు మెడిసిన్‌గా పనిచేస్తాయి.

నిమ్మచెట్టు

ఇంట్లో ఈజీగా పెంచుకునే మొక్కల్లో నిమ్మచెట్టు కూడా ఒకటి. నిమ్మను చాలారకాల వంటల్లో వాడుకోవచ్చు. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఫుడ్స్ లో నిమ్మ ఒకటి. అలాగే నిమ్మ తో చాలా రకాల సమస్యలు తగ్గించుకోవచ్చు. కడుపు నొప్పి, తలనొప్పి, జాయింట్ నొప్పులు, కండరాల నొప్పులు, శ్వాసకోస ఇబ్బందులు, కండరాల తిమ్మిరి లాంటి వాటికి నిమ్మ మంచి మెడిసిన్‌గా పనిచేస్తుంది. నిమ్మ ఆకులు గాలిని క్లీన్ చేసి ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి.

కలబంద

గాలిని క్లీన్ చేసే మొక్కల్లో కలబంద కూడా ఒకటి. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇది ఇంట్లో కుండిల్లో చక్కగా పెరుగుతుంది. దీన్ని శరీరం పైన, లోపల రెండింటి ఆరోగ్యానికి వాడుకోవచ్చు. కలబంద మంచి ఇమ్యూనిటీ బూస్టర్. రోజూ ఒక స్పూన్ కలబంద రసం తాగడం వల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు. జీర్ణ సమస్యలు, ఆకలి వేయకపోవడం,మలబద్ధకం లాంటివి తగ్గించుకోవచ్చు. అలాగే కలబంద రసాన్ని గాయాలు, స్కిన్ ఇన్ఫెక్షన్లకు పూతగా కూడా వాడుకోవచ్చు. జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా కలబంద మంచి ఔషధంగా పనిచేస్తుంది.

పుదీనా

పుదీనా మంచి ఔషధంతో పాటు మంచి మౌత్ ఫ్రెషనర్ కూడా.. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పెరుగుతుంది. ఇంట్లో చిన్న కుండీల్ల పెంచుకోవచ్చు. పుదీనాలో సహజంగా మాంగనీస్, విటమిన్–ఎ , విటమిన్–సి వంటివి ఉంటాయి. ఇది కూడా గాలిని క్లీన్ చేస్తుంది.

Medicinal Plants,plants,Home Garden,Health Benefits
Medicinal Plants, Plants, Home Garden, health news, telugu news, telugu global news, latest telugu news, news, health benefits

https://www.teluguglobal.com//health-life-style/health-benefits-of-best-medicinal-plants-for-your-home-garden-1041708