ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటు చేసి వలసలు అరికడుతాం

2024-11-03 06:07:57.0

శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతంగా ముగిసిందన్న కేంద్ర మంత్రి

https://www.teluguglobal.com/h-upload/2024/11/03/1374471-ram-mohan-naidu.webp

శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతంగా ముగిసిందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటు చేసి వలసలు అరికడుతామని చెప్పారు. 2025 నాటికి వంశధార ఫేజ్‌-2 పూర్తి చేస్తామని చెప్పారు. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం చెప్పారన్నారు. గత ఐదేళ్లలో నీటి పారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటునకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అరసవల్లి ఆలయంలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని రామ్మోహన్‌ నాయుడు వివరించారు.