ఇండియా – కివీస్‌ టెస్ట్‌.. మొదటి రోజు ఆట రద్దు

https://www.teluguglobal.com/h-upload/2024/10/16/1369575-chinnaswami-stadium.jfif

2024-10-16 10:18:01.0

టాస్‌ కు అవకాశమివ్వని భారీ వర్షం

 

ఇండియా – న్యూజిలాండ్‌ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన మొదటి టెస్ట్‌ మొదటి రోజు ఆట వర్షం కారణంగా రద్దయ్యింది. బెంగళూరులో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉండటంతో స్టేడియంలో వర్షపు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో టాస్‌ వేసేందుకు కూడా అవకాశం కలుగలేదు. మధ్యాహ్నం స్టేడియంలోని వచ్చిన అంపైర్లు మొదటి రోజు ఆట సాధ్యం కాదని తేల్చేశారు. ఫస్ట్‌ డే ఆట రద్దు చేసిన నేపథ్యంలో మిగతా నాలుగు రోజుల మ్యాచ్‌ షెడ్యూల్‌ లో అంపైర్లు పలు మార్పులు చేశారు. ప్రతి రోజు ఉదయం 15 నిమిషాల ముందే మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. ఫస్ట్‌ సెషన్‌ ఉదయం 9.15 గంటల నుంచి 11.30 వరకు ఉంటుంది. ఆ తర్వాత 40 నిమిషాల పాటు లంచ్‌ బ్రేక్‌ ఇస్తారు. మధ్యాహ్నం 12.10 నుంచి 2.25 వరకు రెండో సెషన్‌ నిర్వహిస్తారు. టీ బ్రేక్‌ తర్వాత మధ్యాహ్నం 2.45కు మ్యాచ్‌ ప్రారంభమై 4.45 గంటల వరకు కొనసాగుతుంది. కివీస్‌ – ఇండియా మధ్య టెస్ట్‌ మ్యాచ్‌ చుద్దామని వచ్చిన అభిమానులు ఒక్క బాల్‌ కూడా పడకుండానే ఆట రద్దవడంతో నిరాశగా వెనుదిరిగారు.