2025-01-15 07:58:38.0
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అందరికి అమలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. వర్చువల్‌గా నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల గ్రామీణ ఉపాధి హామీ కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నారని వీరంతా కూలీ పనికి వెళ్లే భుమి లేని నిరుపేదలు అని తెలిపారు. ఎస్సీ ఎస్టీ, బీసీ రైతుల ఎక్కువగా ఉంటారు. రాష్ట్రంలో కోటి 2 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఈ కార్డుల ద్వారా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు.
గుంట భూమి ఉన్న రైతులను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించం అని ప్రభుత్వం చెప్పడం దురదృష్ట కరమన్నారు. ఒక్క సెంటు భూమి ఉన్నా కూలీ కాదు అని అంటున్నారు. ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరం 20 రోజులు పని దినాలు ఉంటేనే కూలీగా గుర్తింపు ఉంటుందనే నిబంధన కూడా సరైంది కాదన్నారు. అనారోగ్య సమస్యలతోనూ ఇతర సమస్యలతోనూ పనికి వెళ్లని కూలీలను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించరు అని ప్రభుత్వం చెప్తున్నది. ఈ నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం మార్చి రైతు కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి కొండా సురేఖను మంత్రి కోరారు.
Former Minister Harish Rao,Indiramma Atmiya Bharosa Scheme,landless,EGS cards,Medak District Review Meeting,Minister Konda Surekha,CM Revanth reddy,Telangana goverment,Job cards,KTR,BRS Party,KCR