2025-02-15 15:31:37.0
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. పాలమూరు నుంచి ఇళ్లులకు శ్రీకారం చూట్టాలని భట్టి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రచారం చేయాలని సమాచార, పౌర సంబంధాల శాఖ హౌసింగ్ శాఖలపై సమీక్షలో ఆయన వెల్లడించారు. ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ చుట్టు శాటిలైట్ టౌన్‌షిప్‌లు నిర్శించాలని సూచించారు. మధ్యతరగతి ప్రజల కోసం ఎల్ఐజి, ఎంఐజి, హెచ్ఐజి పేరిట ఇళ్లు కట్టాలని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వడానికి ఈ ఏడు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్ల చొప్పున బడ్జెట్‌లో నిధులు కేటాయించిందన్నారు.
Deputy CM Bhatti Vikramarka,MLC Election Code,ORR,RRR,Satellite,LIG,MIG,HIG,CM Revanth Reddy,Telangana government,KCR,KTR,BRS Party,BJP