ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించండి : మంత్రి పొంగులేటి

2025-01-29 15:14:23.0

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నుంచి బిల్లుల చెల్లింపు వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత వినియోగిస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.

రాష్ట్రంలో మొదటి విడత మంజూరైన 72 వేల ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని అధికారులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, బిల్లుల చెల్లింపులను ఎక్కడి నుంచైనా నిరంతరం పర్యవేక్షించడానికి ఏఐని వినియోగించాలన్నారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్ ద్వారా సర్వే చేసినట్లు మంత్రి వివరించారు.మొబైల్ యాప్ స‌ర్వే వివ‌రాల‌ను క్లౌడ్ ఆధారిత ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో సరిపోల్చి.. అనర్హులను గుర్తించాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Indiramma houses,Minister Ponguleti Srinivas Reddy,Mobile App Survey,Bills to beneficiaries,AI technology,CM Revanth reddy,Telangana goverment,CS Shanthikumari