https://www.teluguglobal.com/h-upload/2022/12/15/500x300_431339-tablet-pack.webp
2022-12-15 06:32:42.0
రక్తంలో చక్కెర స్థాయులను ఇన్సులిన్ నియంత్రిస్తుంది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయ మాలిక్యుల్‌ను మెల్‌బోర్న్‌లోని వాల్టర్ అండ్ ఎలిజా హాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిశోధకులు డాక్టర్ నికోలస్ కిర్క్, ప్రొఫెసర్ మైక్ లారెన్స్ కనుగొన్నారు. రక్తంలో గ్లూకోజ్ తీసుకునే ప్రక్రియను ప్రేరేపించే మాలిక్యుల్‌ను ఈ పరిశోధనలో వారు గుర్తించారు.
మధుమేహంతో (షుగర్ వ్యాధి) బాధపడేవారికి సైంటిస్టులు శుభవార్త చెప్పారు. టైప్-1 డయాబిటిస్ తో ఇబ్బందిపడే వారు ఇకపై రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకునే బాధ తప్పనుంది. త్వరలో ఇన్సులిన్ టాబ్లెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఎప్పటినుంచో ఇన్సులిన్ ను టాబ్లెట్ల రూపంలో తెచ్చేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు ఆస్ట్రేలియా సైంటిస్టులు ఈ పరిశోధనల్లో ముందడుగు వేశారు. వారు చేసిన పరిశోధనలు విజయవంతమయ్యాయి.
రక్తంలో చక్కెర స్థాయులను ఇన్సులిన్ నియంత్రిస్తుంది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయ మాలిక్యుల్‌ను మెల్‌బోర్న్‌లోని వాల్టర్ అండ్ ఎలిజా హాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిశోధకులు డాక్టర్ నికోలస్ కిర్క్, ప్రొఫెసర్ మైక్ లారెన్స్ కనుగొన్నారు. రక్తంలో గ్లూకోజ్ తీసుకునే ప్రక్రియను ప్రేరేపించే మాలిక్యుల్‌ను ఈ పరిశోధనలో వారు గుర్తించారు.
ఇన్సులిన్ అనేది అస్థిరమని, కాబట్టి దానిని మాత్రల రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి కష్టపడుతున్నట్టు డాక్టర్ కిర్క్ పేర్కొన్నారు. ఇప్పుడు ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ (సైరో ఈఎం) సాంకేతికతతో ఇన్సులిన్‌ను ప్రేరేపించే ఒక పెప్టైడ్‌ను గుర్తించినట్టు చెప్పారు. అయితే, దీనిని ఔషధ రూపంగా మార్చేందుకు చాలా సమయం పడుతుందన్నారు. దీనిపై ఇంకా పరిశోధన జరగాల్సి ఉందని వివరించారు.
Insulin tablet,diabetes,Sugar Control Tips in Telugu
Insulin tablet, insulin tablets for type 1 diabetes, sugar, diabetes tips, diabetes health, diabetes Insulin tablet, షుగర్ వ్యాధి, రక్తంలో చక్కెర స్థాయులను ఇన్సులిన్ నియంత్రిస్తుంది
https://www.teluguglobal.com//health-life-style/insulin-tablets-for-type-1-diabetes-552882