2024-10-29 12:49:32.0
Jagan paid tribute to YSR at Idupulapaya
https://www.teluguglobal.com/h-upload/2024/10/29/1373649-jagan.webp
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ జగన్ ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తండ్రి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో మూడ్రోజుల పాటు కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. జగన్ ఇడుపులపాయ పర్యటనకు సంబంధించిన ఫొటోలను మాజీ మంత్రి విడదల రజని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ వెంట పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీకి చెందిన ఇతర ముఖ్యనాయకులు పాల్గొని వైఎస్సార్‌కు నివాళులర్పించారు. కాగా, వైఎస్ జగన్ మంగళవారం ఉదయమే బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పులివెందుల ప్రజలతో పాటు పార్టీ నాయకులను జగన్‌ను కలవనున్నారు.