2024-10-11 07:51:27.0
రాష్ట్రానికి నిధులు తేవడంలో మంత్రులు, ఎంపీలు విఫలం
https://www.teluguglobal.com/h-upload/2024/10/11/1368144-harish-rao.webp
తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులున్నా గోదావరి పుష్కరాలకు నిధులు తేవడంలో ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి హరీశ్ రావు ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం ఏపీకి రూ.100 కోట్లు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు గుండా సున్నా మిగిల్చిందన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధులు రాబట్టడంతో, కేంద్రంపై పోరాటం చేయడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారన్నారు. కేంద్ర బడ్జెట్ లోనూ తెలంగాణకు ఏమీ దక్కలేదని, ఏపీకి అడిషనల్ గ్రాంట్ కింద రూ.15 వేల కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఏపీకి కేంద్రం నిధులు ఇవ్వడంపై తమకు అక్కసు లేదని, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారనేది తమ బాధ అన్నారు. కేంద్రం తెలంగాణను ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలని, నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Godavari pushkaralu,Central Release Rs.100 to AP,No funds for Telangana,Union Govt,Congress Govt,Harish Rao,BRS