https://www.teluguglobal.com/h-upload/2024/11/22/1379899-maoist.webp
2024-11-22 05:10:01.0
పంచాయతీ కార్యదర్శి సహా మరొకరి దారుణ హత్య
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని గొడ్డలితో నరికి చంపారు. వాజేడులో పెనుగోలు కాలనీలో పేరూరు పంచాయతీ కార్యదర్శి ఉయికా రమేశ్, స్థానికుడు ఉయికా అర్జున్‌ను గురువారం అర్ధరాత్రి హతమార్చారు. వెంకటాపురం-వాజేడు ఏరియాలో కమిటీ కార్యదర్శి శాంత పేరిట మావోయిస్టులు రెండు లేఖలను మృతదేహాల వద్ద వదిలి వెళ్లారు. రమేశ్‌ను గొడ్డలితో నరికిన సమయంలో ఆయన భార్య గట్టిగా కేకలు వేయడంతో మావోయిస్టులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మావోయిస్టులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన రమేశ్‌ణు ఏటూరు నాగారం ఆస్పత్రికి 108 వాహనంలో తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు.
Maoists,Brutal murder,panchayat secretary,Wajedu Mandal,Mulugu District